జన్నారం: అగ్నిమాపక నివారణ వారోత్సవాలు

65చూసినవారు
జన్నారం: అగ్నిమాపక నివారణ వారోత్సవాలు
జన్నారం మండలంలో బుధవారం అగ్నిమాపక నివారణ వారోత్సవాలు జరిగాయి. ప్రభుత్వ ఆసుపత్రితో పాటు, పలు ప్రాంతాలలో అగ్ని ప్రమాదాల నివారణపై అగ్నిమాపక శాఖ అధికారి శ్రీనివాస్ అవగాహన కల్పించారు. అగ్ని ప్రమాదాలు జరిగినప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి వివరించారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ ఆసుపత్రి వైద్యురాలు డాక్టర్ ఉమాశ్రీ, వైద్య సిబ్బంది, అగ్నిమాపక సిబ్బంది పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్