జన్నారం: వేద పండితుల సమక్షంలో గజ్జెల పూజలు

59చూసినవారు
జన్నారం: వేద పండితుల సమక్షంలో గజ్జెల పూజలు
మంచిర్యాల జిల్లా జన్నారం మండలంలో నాట్య కళా, రంగాలలో చిన్నారులు రాణించాలని కోరుకుంటూ వారి తల్లిదండ్రులు గజ్జెల పూజలు నిర్వహించారు. ఆదివారం ఉదయం రామ్ నగర్ లో ఉన్న రామాలయంలో వారు వేద పండితుల సమక్షంలో గజ్జెల పూజలు చేశారు. నాట్యాన్ని నేర్చుకోవాలని చిన్నారులు మొదట గజ్జెలకు పూజలు నిర్వహించి నాట్య శిక్షణను పొందుతారని నర్మదా గౌడ్ వెల్లడించారు.

సంబంధిత పోస్ట్