మార్కెట్లో డిమాండ్ ఉండి లాభం తెచ్చే పంటల గురించి రైతులకు వ్యవసాయ అధికారులు చెప్పాలని తెలంగాణ రైతు సంఘం మంచిర్యాల జిల్లా ఉపాధ్యక్షులు కొండగొర్ల లింగన్న కోరారు. శనివారం జన్నారంలో ఆయన మాట్లాడుతూ వ్యవసాయ అధికారుల సూచనల మేరకు కొంతమంది రైతులు పొలాల్లో జనుము, జీలుగ పంటలు వేస్తున్నారన్నారు. జూలై 15 తర్వాత వరితో పాటు పూజ పంటలు సాగుచేసే అవకాశం ఉందని ఆయన అన్నారు. వరితో పాటు లాభం తెచ్చే పంటల గురించి రైతులకు తెలపాలని అధికారులను ఆయన కోరారు.