ఈనెల 20న జరిగే దేశవ్యాప్త సమ్మెను విజయవంతం చేయాలని సీఐటీయూ జన్నారం మండల కన్వీనర్ అంబటి లక్ష్మణ్ అన్నారు. జన్నారం మండలం పొన్కల్ లో మంగళవారం సమ్మె కరపత్రాలను విడుదల చేశారు. కేంద్ర ప్రభుత్వం ఉపాధి హామీ వ్యవస్థను నిర్వీర్యం చేయాలని చూస్తుందని ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వం సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఉపాధి కూలీలకు 200 రోజుల పని కల్పించి, ప్రతి కూలికి రోజుకు 600 రూపాయలు చెల్లించాలన్నారు.