ఏపీ బ్రాండ్‌ను దెబ్బతీశారు: చంద్రబాబు (వీడియో)
ఏపీ బ్రాండ్‌ను దెబ్బతీసేలా గత ప్రభుత్వం వ్యవహరించిందని సీఎం చంద్రబాబు తెలిపారు. అసెంబ్లీలో ఆయన మాట్లాడుతూ.. ‘ఏపీ బ్రాండ్‌ను గత ప్రభుత్వం దెబ్బతీసింది. రాష్ట్ర అభివృద్ధి వెనకబడింది. వాస్తవాలు బయటకు రావాల్సిన సమయం వచ్చింది. పూర్తి ఆధారాలతో మీ ముందుకు వస్తాం. తప్పకుండా చర్యలు తీసుకుంటాం. అప్పుడే వేరొకరు తప్పు చేయడానికి భయపడతారు. రాష్ట్ర చరిత్రలో ఏ నాయకుడు చేయని తప్పులను గత ప్రభుత్వంలో అప్పటి సీఎం చేశారు.’ అని అన్నారు.