ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్య అందుతుందని హెచ్ఎం దిగంబర్ అన్నారు. శుక్రవారం జన్నారం మండలం కవ్వాల్ లోని ఎంపీపీఎస్ లో చిన్నారులకు సామూహిక అక్షరాభ్యాస కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఉపాధ్యాయులు చిన్నారులతో పలకలపై అక్షరాలను దిద్దించారు. బెలూన్స్ కట్టి, చిన్నారులకు స్వీట్స్ పంచారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు బిక్కు, గోవింద్, తదితరులు పాల్గొన్నారు.