జన్నారం మండలంలోని ప్రధాన, గ్రామీణ రోడ్లు కోతకు గురికావడంతో ప్రమాదాలు పొంచి ఉన్నాయని వాహనదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జన్నారం శివారులోని సబ్ స్టేషన్ వద్దనున్న ప్రధాన రహదారి కోతకు గురైంది. భారీ వర్షాలు పడే పక్షంలో అక్కడ ప్రమాదాలు జరిగే అవకాశాలు ఉన్నాయని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అలాగే బాదంపల్లి, కిష్టాపూర్ తదితర గ్రామాలకు వెళ్లే రోడ్డు కూడా కోతకు గురై ప్రమాదకరంగా మారాయన్నారు.