జన్నారం మండలంలోని వివిధ గ్రామాల శివారులలో ఉన్న కవ్వాల్ అభయారణ్యం ప్రకృతి రమణీయతకు మారుపేరుగా మారింది. మండలంలో ఐదు రోజులుగా మోస్తారు నుంచి భారీ వర్షాలు పడుతున్నాయి. జన్నారం, ఇందన్ పల్లి రేంజ్ పరిధిలో ఉన్న వివిధ అటవీ ప్రాంతాలు పూర్తిగా పచ్చదనంగా మారాయి. కొండలు, గుట్టలు, లోయలు చుట్టూరా ఉన్న అడవి పచ్చదనంగా మారి అందరినీ ఆకట్టుకుంటుంది. ఒకవైపు ఆకాశంలో మబ్బులు, వాటిని తాకేలా కొండలు ఉండటంతో ఆ ప్రాంతం అందంగా మారింది.