మాదిగ కులస్తుల సమస్యలు పరిష్కరించాలని ఎమ్మార్పీఎస్ జన్నారం మండల అధ్యక్షులు కొండుకూరి ప్రభుదాస్ కోరారు. రాష్ట్ర మంత్రిగా నియమితులైన అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ను ఆదివారం ఎమ్మార్పీఎస్ నాయకులు ధర్మపురిలోని క్యాంప్ కార్యాలయంలో మంత్రిని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మాదిగలకు ప్రభుత్వ పథకాలు అందేలా కృషి చేయాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో పలువురు ఎమ్మార్పీఎస్ నాయకులు ఉన్నారు.