జన్నారం మండల కేంద్రంలో అటవీ ఆంక్షలు ఎత్తివేయాలని అఖిలపక్షం ఆధ్వర్యంలో బుధవారం జన్నారం పట్టణం బంద్ పిలుపు నివ్వడంతో వ్యాపారులు, ప్రజలు స్వచ్ఛందంగా బంద్ పాటించారు. ఈ బందులో అన్ని వర్గాల వ్యాపార సముదాయాలు బంద్ లో పాల్గొని దుకాణాలన్నీ స్వచ్ఛందంగా మూసి ఉంచారు. దీంతో మండల కేంద్రంలో రోడ్లన్నీ నిర్మానుషంగా మారాయి.