
మళ్లీ అధికారంలోకి వస్తాం: జగన్
AP: మరో 4 ఏళ్ల తర్వాత మళ్లీ వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వస్తుందని మాజీ సీఎం జగన్ అన్నారు. బుధవారం తాడేపల్లిలో జరిగిన వైసీపీ ఆవిర్భావ దినోత్సవంలో పాల్గొన్న అనంతరం ఆయన మాట్లాడారు. ‘ప్రజల కష్టాల నుంచే వైసీపీ ఆవిర్భవించింది. ప్రతిపక్షంలో ఉండటం మనకు కొత్త కాదు. 15 ఏళ్లలో 10 ఏళ్లు ప్రతిపక్షంలోనే ఉన్నాం. ప్రభుత్వానికి దీటైన సమాధానం ఇస్తున్నాం.’ అని అన్నారు.