రైతుల అభివృద్ధ, క్షేమం కోసం వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రభుత్వం ప్రారంభించిందని రాష్ట్ర గిరిజన కో-ఆపరేటివ్ ఆర్థిక అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ కోట్నాక తిరుపతి పేర్కొన్నారు. ఆదివారం లక్షేటిపేట పట్టణంలోని గంపలపల్లి గ్రామంలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించి ఆయన మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల అభివృద్ధి కోసం రైతులకు అండగా ఉండి ప్రజా పాలన కొనసాగిస్తుందన్నారు.