లక్షెటిపేట: పాఠశాలను, కళాశాలను పరిశుభ్రంగా ఉంచాలి

75చూసినవారు
లక్షెటిపేట: పాఠశాలను, కళాశాలను పరిశుభ్రంగా ఉంచాలి
లక్షెటిపేట పట్టణంలో నూతనంగా ప్రారంభించిన పాఠశాలను, కళాశాలను పరిశుభ్రంగా ఉంచాలని మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు సూచించారు. శుక్రవారం విద్యాశాఖ అధికారులు, ఉపాధ్యాయులు, అధ్యాపకులతో సమావేశం నిర్వహించారు. విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని నూతన భవనాలను నిర్మించామని తెలిపారు. ఆ భవనాలను సొంత ఇళ్ల మాదిరిగా చూసుకోవాలని ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో విద్యాశాఖ అధికారులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్