లక్షెట్టిపేట తాలూకా, ఖానాపూర్ నియోజకవర్గాన్ని అగ్రి జోన్ గా మారిస్తేనే అభివృద్ధి సాధ్యమని శనివారం రైతులు అన్నారు. లక్షెట్టిపేట తాలూకాలో ఎల్లంపల్లి, ఖానాపూర్ నియోజకవర్గంలో కడెం సదర్ మార్ట్ ప్రాజెక్టులు, గోదావరి తీరం, చెరువులు, కాలువలు, తదితర నీటి వనరులు ఉన్నాయి. వాటిని ఆధారం చేసుకుని రైతులు ప్రతి సంవత్సరం పంటలు సాగు చేస్తున్నారు. దీంతో ఆయా ప్రాంతాలు పంటలకు ప్రసిద్ధి చెందాయి.