మూడు సంవత్సరాలు దాటిన చిన్నారులకు వరం అంగన్వాడీ కేంద్రాలని డిడబ్ల్యుఓ రవుఫ్ ఖాన్, లక్షెట్టిపేట సిడిపిఓ రేష్మ కోరారు. అమ్మ మాట అంగన్వాడి బాట కార్యక్రమంలో భాగంగా శుక్రవారం జన్నారం గ్రామంలోని అంగన్వాడీ కేంద్రం-3లో నిర్వహించిన కార్యక్రమంలో వారు పాల్గొన్నారు. అంగన్వాడి కేంద్రం ద్వారా చిన్నారులకు పౌష్టికాహారం లభిస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో సూపర్వైజర్లు పద్మ, అంగన్వాడీ టీచర్లు పాల్గొన్నారు.