లక్షేటిపేట: నేడు విద్యుత్ సరఫరాలో అంతరాయం

58చూసినవారు
లక్షేటిపేట: నేడు విద్యుత్ సరఫరాలో అంతరాయం
లక్షేట్టిపేట మండలంలోని వెంకటరావుపేట 33 కెవి సబ్ స్టేషన్ పరిధిలో శనివారం విద్యుత్ సరఫరా నిలిపివేయనున్నట్లు విద్యుత్ శాఖ ఏఈ గణేష్ తెలిపారు. కొత్త కొమ్ముగూడెం, పాత కొమ్ముగూడెం, దొడపల్లి, తలమల, చెల్లంపేట, ఎల్లారం, కొత్తూరు, చెందారం, రంగపేట, హనుమంతుపల్లి గ్రామాల్లో విద్యుత్ అంతరాయం ఉంటుందని పేర్కొన్నారు. సబ్ స్టేషన్ మరమ్మత్తుల కారణంగా విద్యుత్ సరఫరా నిలిపివేస్తున్నట్లు వెల్లడించారు.

సంబంధిత పోస్ట్