లక్షెటిపేట పట్టణంలో ఇద్దరు మంత్రులు పర్యటించనున్నారని మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు బుధవారం తెలిపారు. పట్టణంలో పూర్తయిన ప్రభుత్వ పాఠశాల, కళాశాలల భవనాలను ప్రారంభించేందుకు గురువారం ఉ. 10 గంటలకు జిల్లా ఇన్చార్జి మంత్రి సీతక్క, రాష్ట్రమంత్రి దుద్దిల్ల శ్రీధర్ రావు రానున్నారని ఆయన స్పష్టం చేశారు. ఆయా కార్యక్రమాలలో ప్రభుత్వ అధికారులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, విద్యార్థులు, తల్లిదండ్రులు పాల్గొనాలన్నారు.