మంచిర్యాల ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు ఆధ్వర్యంలో బుధవారం మహాత్మాగాంధీ జయంతి వేడుకలు నిర్వహిస్తున్నట్లు పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు తూముల నరేష్ తెలిపారు. ఉదయం 9 గంటలకు స్థానిక గాంధీ పార్క్ లో గాంధీ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పిస్తారని పేర్కొన్నారు. అనంతరం దండేపల్లిలో గాంధీ జయంతి కార్యక్రమంలో పాల్గొంటారని, కాంగ్రెస్ శ్రేణులు పెద్దసంఖ్యలో పాల్గొనాలని ఆయన కోరారు.