
మళ్లీ పెరిగిన బంగారం ధరలు
హైదరాబాద్ బులియన్ మార్కెట్లో వరుసగా రెండో బంగారం ధరలు పెరిగాయి. ఇవాళ 22 క్యారెట్ల 10 గ్రా. బంగారం ధర రూ.550 పెరిగి రూ.81,200లకు చేరింది. 24 క్యారెట్ల 10 గ్రా. గోల్డ్ రేటు రూ.600 పెరగడంతో రూ.88,580లు పలుకుతోంది. అలాగే వెండి ధర రెండో రోజు రూ.1000 పెరిగి కేజీ సిల్వర్ ధర రూ.1,10,000లకు చేరింది.