మంచిర్యాల జిల్లాలో వరి ధాన్యం కొనుగోలుకు పూర్తిస్థాయిలో ఏర్పాటు చేసినట్లు కలెక్టర్ కుమార్ దీపక్ తెలిపారు. శుక్రవారం కలెక్టరేట్లో ఆయన మాట్లాడుతూ జిల్లాలో 321 వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. తాలు, తప్ప, మట్టి పిల్లలు లేని ధాన్యాన్ని తీసుకురావాలని సూచించారు. సన్న బియ్యం పక్కదారి పట్టకుండా పటిష్ట చర్యలు తీసుకోవాలన్నారు.