విద్యా సంస్థలు ఈ నెల 12వ తేదీ నుంచి పునఃప్రారంభం కానున్నాయి. కానీ ప్రైవేట్ బడుల బస్సులకు ఫిట్నెస్ లేదని ప్రజలు మండిపడుతున్నారు. జిల్లాలో 380 బస్సుల్లో సగానికి పైగా వాటికి ఫిట్నెస్ లేవని సమాచారం. ప్రైవేటు విద్యా సంస్థల యాజమాన్యాలు నిర్లక్ష్యంగా వ్యవహరించడంతోనే ప్రమాదాలు జరుగుతున్నాయని తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తనిఖీలు చేపట్టి సీజ్ చేస్తామని రవాణాశాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు.