మంచిర్యాల జిల్లాలో జాతీయ నులిపురుగుల నిర్మూలన కార్యక్రమాన్ని సమర్ధవంతంగా నిర్వహించాలని మంచిర్యాల కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. మంగళవారం ఆయన అదనపు కలెక్టర్ మోతిలాల్, డిఎంహెచ్ఓ హరీష్ రాజ్ తో కలిసి మాట్లాడారు. ఈనెల 10న జాతీయ నులి పురుగుల దినోత్సవం పురస్కరించుకొని ఒకటి నుంచి పది సంవత్సరాల పిల్లలకు నులిపురుగుల నిర్మూలల కోసం ఆల్బెండజోల్ మాత్రలు అందించినున్నట్లు తెలిపారు.