మంచిర్యాల జిల్లా పశుసంవర్ధక శాఖ డైరీ- 2025ను సోమవారం జిల్లా పశుసంవర్ధక శాఖ అధికారి డాక్టర్ శంకర్ ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి టీఎన్జీవో జిల్లా అధ్యక్షులు గడియారం శ్రీహరి, పశుసంవర్ధక శాఖ ఉద్యోగుల జిల్లా అధ్యక్షురాలు విజయభారతి హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పశు సంపద అభివృద్ధికి ప్రభుత్వం అందిస్తున్న పథకాలను లబ్ధిదారులు సద్వినియోగం చేసుకోవాలన్నారు.