జిల్లా స్థాయి సోషల్ స్టడీస్ టాలెంట్ టెస్టును శనివారం మంచిర్యాలలోని బాలికల ఉన్నత పాఠశాలలో గాంధీ గ్లోబల్ ఫ్యామిలీ, గాంధీ జ్ఞాన ప్రతిష్టాన్ వారి సౌజన్యంతో సోషల్ స్టడీస్ ఫోరం ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది. ఈ టాలెంట్ టెస్టులో జిల్లా వ్యాప్తంగా వివిధ యజమాన్యాలలోని ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న 140 మంది విద్యార్థినీ విద్యార్థులు పాల్గొనడం జరిగింది. ఈ కార్యక్రమంలో టంకశాల నరేందర్ రావు, తదితరులు పాల్గొన్నారు.