ఎవరైనా బాలలను పనుల్లో పెట్టుకున్న, తప్పిపోయిన, వదిలేసిన వారి సమాచారం తెలిస్తే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని రామగుండం పోలీస్ కమిషనర్ శ్రీనివాస్ తెలిపారు. మంగళవారం ఆయన మాట్లాడుతూ చైల్డ్ హెల్ప్ లైన్ 1098, డయల్ వందకు సమాచారం అందించాలని సూచించారు. నిబంధనలు అతిక్రమించిన వారిపై కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. బాల కార్మిక వ్యవస్థ నిర్మూలనకు ప్రతి ఒక్కరు బాధ్యతయుతంగా వ్యవహరించాలని పేర్కొన్నారు.