
కమల్‌హాసన్ ఇంకా క్షమాపణలు చెప్పలేదా?: కర్ణాటక హైకోర్టు
తమిళం నుంచే కన్నడ భాష పుట్టిందని వ్యాఖ్యలు చేసిన నటుడు కమలహాసన్ ఇంకా కన్నడిగులకు క్షమాపణ చెప్పలేదా? అని కర్ణాటక హైకోర్టు ప్రశ్నించింది. చరిత్ర తెలియకుండా వ్యాఖ్యలు చేసి క్షమాపణలు చెప్పకుండా, వివాదాన్ని ఎందుకు తీవ్రం చేసుకున్నారని ఆగ్రహం వ్యక్తం చేసింది. తదుపరి విచారణ ఈ నెల 20కు వాయిదా పడింది. కాగా కమల్ వ్యాఖ్యలపై కన్నడిగులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తోన్న విషయం తెలిసిందే.