అగ్ని ప్రమాదాల నివారణపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు ఈనెల 20 వరకు జాతీయ అగ్నిమాపక వారోత్సవాలను నిర్వహిస్తున్నట్లు మంచిర్యాల కలెక్టర్ కుమార్ దీపక్ బుధవారం పేర్కొన్నారు. జిల్లాలోని మంచిర్యాల, బెల్లంపల్లి, జన్నారం, చెన్నూర్ ప్రాంతాల్లోని అగ్నిమాపక శాఖ కేంద్రాల ఆధ్వర్యంలో వారం పాటు ఆసుపత్రులు, ఫంక్షన్ హాలు, విద్యాసంస్థల్లో ప్రమాదాలకు అడ్డుకట్ట వేసేందుకు అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు.