ఇంటర్మీడియట్ పరీక్షలు గురువారం ప్రశాంతంగా ముగిశాయి. ఈనెల ఐదున పరీక్షలు ప్రారంభం కాగా ఈసారి ఒక విద్యార్థి కూడా డివార్ కాకుండా పరీక్షలు సాఫీగా సాగాయి. పరీక్షా కేంద్రాల్లో విద్యార్థులకు ఇబ్బందులు తలెత్తకుండా అన్నిచోట్ల విద్యుత్, నీటి సౌకర్యం, రవాణా సౌకర్యం కల్పించినట్లు డిఐఈఓ అంజయ్య తెలిపారు. క్షణం తీరికలేకుండా పుస్తకాలతో కుస్తీ పట్టిన విద్యార్థులు పరీక్షలు ముగియడంతో ఆనందంలో మునిగితేలారు.