మంచిర్యాల: పరీక్షా సామాగ్రి అందజేసిన మాధవసేవా సమితి ట్రస్ట్

75చూసినవారు
మంచిర్యాల: పరీక్షా సామాగ్రి అందజేసిన మాధవసేవా సమితి ట్రస్ట్
మాధవసేవా సమితి చారిటబుల్ ట్రస్ట్ మంచిర్యాల వారి ఆధ్వర్యంలో బుధవారం చెన్నూరు నియోజకవర్గ కోటపల్లి మండలంలోని అన్నారం గ్రామాలలోని జిల్లా పరిషత్ పాఠశాలలో పదవ తరగతి విద్యార్థులకు పరీక్షా సామాగ్రి అందజేయడం జరిగింది. అనంతరం ట్రస్టు కార్యదర్శి మిట్టపల్లి రవీందర్ రెడ్డి మాట్లాడుతూ పదవ తరగతి చదువుతున్న విద్యార్థులు పరీక్షలు సమీపిస్తున్న సమయంలో మానసికంగా దృఢంగా ఉండాలని అపోహలకు పెంచుకొని భయపడకూడదన్నారు.

సంబంధిత పోస్ట్