నిరంతరం విధులు నిర్వహించే పోలీస్ సిబ్బందికి ఎదురయ్యే ఆరోగ్య సమస్యల పట్ల శ్రద్ధ వహించి తగు జాగ్రత్తలు తీసుకోవాలని రామగుండం సీపీ అంబర్ కిషోర్ ఝూ సూచించారు. పోలీస్ కమిషనరేట్ పరిధిలోని పోలీసులు అధికారులకు నిర్వహించిన హెల్త్ క్యాంపు ఆయన ప్రారంభించి మాట్లాడారు. సిబ్బంది కేవలం పరీక్షలతో సరిపెట్టుకోకుండా డాక్టర్లు సలహాలను పాటిస్తూ సమయానికి మందులను తీసుకుంటూ ఆరోగ్యంగా వుండాలని సూచించారు.