మంచిర్యాల: త్వరలోనే కొత్త పాఠశాలలు ప్రారంభిస్తాం

0చూసినవారు
మంచిర్యాల: త్వరలోనే కొత్త పాఠశాలలు ప్రారంభిస్తాం
మంచిర్యాల జిల్లాలో విద్యార్థులు ఉండి ప్రభుత్వ పాఠశాల లేని చోట కొత్త బడులు ఏర్పాటు చేయనున్నట్లు డిఇఓ యాదయ్య తెలిపారు. పాఠశాలలకు అనుకూలమైన భవనాలు, మౌలిక వసతులు సమకూర్చడంపై దృష్టి సారించినట్లు పేర్కొన్నారు. వీలైనంత త్వరలోనే కొత్త బడులు ప్రారంభం కానున్నాయని వెల్లడించారు. ఇదివరకు పిల్లలు తక్కువగా ఉండి టీచర్లు ఎక్కువగా ఉన్న పాఠశాలల నుంచి కొత్త పాఠశాలలకు ఉపాధ్యాయులను డిప్యూటేషన్ పై పంపిస్తామన్నారు.

సంబంధిత పోస్ట్