మంచిర్యాల పట్టణంలోని రైల్వే స్టేషన్ దగ్గరలో ఉన్న పోస్ట్ ఆఫీస్ లో బీపీ మండల కమిషన్ సిఫారసులు అమలు చేయాలని డిమాండ్ చేస్తూ జాతీయ బీసీ హక్కుల పోరాట సమితి ఆధ్వర్యంలో ప్రధాని మోడీకి పోస్ట్ కార్డులు మంగళవారం పోస్ట్ చేశారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షులు శ్రీనివాస్ మాట్లాడుతూ 1978లో బీపీ మండల కమిషన్ ఏర్పాటు జరిగింది. బీపీ కమిషన్ సిఫారసులపై కేంద్ర ప్రభుత్వం దృష్టి సారించి బీసీలకు న్యాయం చేయాలని అన్నారు.