శాసనమండలి ఎన్నికల దృష్ట్యా ప్రతి సోమవారం నిర్వహించే ప్రజా కార్యక్రమాన్ని రద్దు చేస్తున్నట్లు మంచిర్యాల కలెక్టర్ కుమార్ దీపక్ శనివారం తెలిపారు. ఎన్నికల కోడ్ ముగిసే వరకు ప్రజావాణి కార్యక్రమం నిర్వహణ ఉండదని ప్రజలు ఈ విషయాన్ని గమనించాలని కోరారు. ఎన్నికలు ముగియగానే ఎప్పటిలాగే ప్రజావాణిని నిర్వహిస్తామని ఆయన తెలిపారు.