మంచిర్యాల పట్టణంలోని ఐబి చౌరస్తాలోని అంబేద్కర్ విగ్రహం వద్ద బీసీ డిక్లరేషన్ అమలు చేసిన తర్వాతనే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని డిమాండ్ చేస్తూ జాతీయ బీసీ హక్కుల పోరాట సమితి ఆధ్వర్యంలో మోకాళ్లపై నిల్చుని నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షులు గుమ్ముల శ్రీనివాస్ మాట్లాడుతూ బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు అమలు చేసి వాటిని ఏబీసీడీలుగా వర్గీకరించిన తర్వాతనే ఎన్నికలు నిర్వహించాలని అన్నారు.