హైదరాబాద్ లో ప్రముఖ నటి విజయ శాంతి స్వగృహములో శుక్రవారం సింగరేణి విశ్రాంత ఉద్యోగులు ఎం. బాబు రావు, ఏ. వేణు మాధవ్, తదితరులు మర్యాదపూర్వకంగా కలసి ఆమె శాసన మండలికి ఎన్నికైన సంధర్బంగా శాలువతో సత్కరించి శుభాకాంక్షలు తెలిపినారు. ఈ కార్యక్రమంలో విజయశాంతి మాట్లాడుతూ సింగరేణి కార్మికుల కష్టాలు, త్యాగాలు మరువలేనివి అని తెలిపారు. సింగరేణి విశ్రాంత ఉద్యోగుల సమస్యలను ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్తానని తెలిపారు.