తెలంగాణ ఆర్ఎంపీ, పీఎంపీ వెల్ఫేర్ అసోసియేషన్ జిల్లా సర్వసభ్య సమావేశం శుక్రవారం మంచిర్యాలలో జరిగింది. ఈ సందర్భంగా ఆర్ఎంపీ, పీఎంపీల సమస్యలపై చర్చించారు. అనంతరం నూతన జిల్లా అధ్యక్షుడిగా దొంతుల మొండయ్య, ఉపాధ్యక్షులుగా శైలేంద్ర రాము చారి, ప్రధాన కార్యదర్శిగా మేడిపల్లి విజయ్, కోశాధికారిగా టి. రాజేందర్, సహాయ కార్యదర్శిగా కొయ్యల రాజు, గౌరవ అధ్యక్షులు బెంజిమెన్, ముఖ్య సలహాదారుగా కె. శంకరయ్యను ఎన్నుకున్నారు.