మంచిర్యాల: టీఎన్జీవోస్ భవన్‌లో సావిత్రిబాయి పూలే జయంతి వేడుకలు

56చూసినవారు
మంచిర్యాల: టీఎన్జీవోస్ భవన్‌లో సావిత్రిబాయి పూలే జయంతి వేడుకలు
మంచిర్యాలలోని టీఎన్జీవోస్ భవన్ లో శుక్రవారం సావిత్రిబాయి పూలే జయంతిని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సావిత్రిబాయి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం టీఎన్జీవోస్ జిల్లా అధ్యక్షులు గడియారం శ్రీహరి మాట్లాడుతూ సావిత్రిబాయి జయంతిని మహిళా ఉపాధ్యాయ దినోత్సవంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించడం హర్షణీయం అన్నారు. మహిళా విద్యకు తన జీవితాన్ని అంకితం చేసిన త్యాగమయి సావిత్రిబాయి పూలే అని కొనియాడారు.

సంబంధిత పోస్ట్