మంచిర్యాల: సింగరేణి ఎస్సీ, ఎస్టీ ఉద్యోగుల సంఘం క్యాలెండర్ ఆవిష్కరణ

81చూసినవారు
మంచిర్యాల: సింగరేణి ఎస్సీ, ఎస్టీ ఉద్యోగుల సంఘం క్యాలెండర్ ఆవిష్కరణ
తెలంగాణ రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్యను హైదారాబాద్ లో శనివారం మంచిర్యాల సింగరేణి ఎస్సీ, ఎస్టీ ఉద్యోగుల సంఘం నాయకులు మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ ఉద్యోగుల సమస్యలను ఆయనకు వివరించారు. అనంతరం సంఘం నూతన సంవత్సర క్యాలెండర్ ను ఆయన ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో సంఘం ప్రధాన కార్యదర్శి అంతోటి నాగేశ్వరరావు, కోశాధికారి, మల్లేష్, శ్రీరాంపూర్ ఏరియా వైస్ ప్రెసిడెంట్ డేగల ప్రవీణ్ కుమార్ పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్