తెలంగాణ నాన్ గెజిటెడ్ ఉద్యోగుల పరస్పర సహాయ సహకార గృహ నిర్మాణ సంఘం లిమిటెడ్ మంచిర్యాల జిల్లా నూతన కార్యవర్గాన్ని శుక్రవారం ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అధ్యక్షుడిగా గడియారం శ్రీహరి, కార్యదర్శిగా మహమ్మద్ హాబీబ్ హుస్సేన్, ఉపాధ్యక్షులుగా ఎస్. మొండయ్య, సంయుక్త కార్యదర్శిగా భూముల రామ్మోహన్, కోశాధికారిగా డి. రాజమౌళి, కార్యవర్గ సభ్యులుగా నాగుల గోపాల్, కళావతి, ప్రసాదరావు, ఇంతియాజ్ అహ్మద్ ను ఎన్నుకున్నారు.