
పాక్ హైకమిషన్ ఉద్యోగి రెహమాన్‌పై భారత్ వేటు
పాకిస్తాన్‌కు భారత్ మరో బిగ్ షాక్ ఇచ్చింది. పాకిస్తాన్‌తో కాల్పుల విరమణ కొనసాగుతున్న వేళ భారత్ అనూహ్య నిర్ణయం తీసుకుంది. పాకిస్తాన్ హైకమిషన్ కార్యాలయంలో పనిచేస్తోన్న పాక్ అధికారికి కేంద్రం నోటీసులు జారీ చేసింది. 24 గంటల్లో భారత్ వదిలి వెళ్లిపోవాలని ఆదేశించింది. తన అధికార హోదాకు తగ్గట్టు ప్రవర్తించలేదని నోటీసులో పేర్కొంది. ఈ మేరకు భారత విదేశాంగశాఖ ఆదేశాలు వెలువరించింది.