
అమరావతికి రూ.47 వేల కోట్లు అవసరం: చంద్రబాబు
AP: సీఎం చంద్రబాబు బుధవారం 16వ ఆర్థిక సంఘం అధికారులతో సమావేశమయ్యారు. ఈ సమావేశంలో రాజధాని అమరావతి నిర్మాణానికి ఇంకా రూ.47 వేల కోట్లు అవసరమవుతాయని తెలిపారు. మౌలిక సదుపాయాలు, అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టేందుకు రూ.77,249 కోట్లు అవసరమవుతాయన్నారు. కాగా ఇప్పటికే వరల్డ్ బ్యాంక్, హడ్కో, కేఎఫ్‌డబ్ల్యూ డెవలప్మెంట్ బ్యాంక్ నుంచి రూ. 31,000 కోట్లు సమకూరినట్లు వెల్లడించారు.