సంక్రాంతి పండుగ సందర్భంగా జిల్లా స్వచ్ఛంద సేవా సంస్థల ప్రతినిధి లయన్ వి. మధుసూదన్ రెడ్డి ఆధ్వర్యంలో శనివారం మంచిర్యాల పట్టణంలో మహిళలకు ముగ్గుల పోటీలు నిర్వహించారు. గోదావరి రోడ్ లోని హరినిలయ విల్లాస్ ప్రాంగణంలో జరిగిన ఈ పోటీల్లో పెద్దసంఖ్యలో మహిళలు పాల్గొని చూడచక్కని ముగ్గులు వేశారు. అనంతరం విజేతలకు నగదు బహుమతి అందజేశారు. ఈ పోటీలకు న్యాయ నిర్ణేతలుగా జి. భాగ్యలక్ష్మి, సువర్ణ, మణిమాల వ్యవహరించారు.