మంచిర్యాల జిల్లాలో తొలి ఏకాదశి పండుగను ఆదివారం జరుపుకునేందుకు ప్రజానికం సిద్ధమైంది. ఉత్తర తీరాన్న గోదావరిలో పుణ్య స్థలాలు దర్శించి ప్రముఖ ఆలయాలను సందర్శించనున్నారు. ఈ పర్వదినంతోనే హిందువుల పండుగలు వరుసగా వినాయక చవితి, దసరా, దీపావళి, సంక్రాంతి వంటివి రానుండగా భక్తజనం ఆధ్యాత్మికంలో మునిగితేలనున్నారు.