
ప్రధాని మోదీని కలవాలంటే ఆర్టీపీసీఆర్ టెస్టు తప్పనిసరి!
దేశంలో కరోనా కేసులు పెరుగుతుండడంతో జాగ్రత్తలు మళ్లీ కట్టుదిట్టమవుతున్నాయి. ప్రస్తుతం దేశవ్యాప్తంగా కరోనా కేసులు 7వేలు దాటాయి. గత 24 గంటల్లోనే 306 కొత్త కేసులు నమోదయ్యాయి. ఈ నేపథ్యంలో ప్రధాని నరేంద్రమోదీని కలిసే మంత్రులు, అధికారులు, ప్రముఖులు తప్పనిసరిగా ఆర్టీపీసీఆర్ పరీక్షలు చేయించుకోవాలని కేంద్రం నిర్ణయించినట్లు సమాచారం. ఇలాగే కరోనా కేసులు పెరుగుతూ పోతే.. ఇక ఆంక్షలు తప్పనిసరి కావొచ్చు.