మంచిర్యాల ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావును ఆదివారం టీఎన్జీవోస్ జిల్లా అధ్యక్షులు గడియారం శ్రీహరి ఆధ్వర్యంలో నాయకులు మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా పుష్పగుచ్చం అందించి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ ఉద్యోగులకు ఎల్లవేళలా సహాయ సహకారాలు అందిస్తానని తెలిపారు. సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి పరిష్కారానికి కృషి చేస్తానని చెప్పారు.