మంచిర్యాల: ‘ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా పోరాడాలి'

80చూసినవారు
మంచిర్యాల: ‘ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా పోరాడాలి'
మంచిర్యాల కేంద్రంలోని బీజేపీ సర్కార్ అవలంబిస్తున్న ప్రైవేటీకరణ విధానాలకు వ్యతిరేకంగా కార్మికవర్గం పోరాడాలని సీపీఐ (ఎంఎల్) మాస్న్ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు నంది రామయ్య పిలుపునిచ్చారు. ఆదివారం మంచిర్యాలలో జరిగిన టీయూసీఐ జిల్లా ప్రథమ మహాసభలో ఆయన మాట్లాడారు. అసంఘటిత రంగంలోని కార్మికులకు కనీస పెన్షన్ రూ. 9 వేలు చెల్లించాలని డిమాండ్ చేశారు. జులై 9న తలపెట్టిన దేశవ్యాప్త సమ్మెను జయప్రదం చేయాలని కోరారు.

సంబంధిత పోస్ట్