మంచిర్యాల: భారత ఆర్థిక వ్యవస్థ అభివృద్ధికి సిరామిక్స్ రంగం దోహదం

55చూసినవారు
మంచిర్యాల: భారత ఆర్థిక వ్యవస్థ అభివృద్ధికి సిరామిక్స్ రంగం దోహదం
భారత ఆర్థిక వ్యవస్థ అభివృద్ధికి సిరామిక్స్ రంగం ఎంతో దోహదపడుతుందని పెద్దపల్లి పార్లమెంటు సభ్యులు గడ్డం వంశీకృష్ణ అన్నారు. శుక్రవారం ‌కోల్ కతాలోని సెంట్రల్ గ్లాస్ అండ్ సిరామిక్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ లో జరిగిన పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా సిరామిక్స్ రంగంలో జరిగిన సైన్స్ అండ్ టెక్నాలజీ పురోగతులపై సమీక్షించి, పరిశోధన, అభివృద్ధి, నూతన ఆవిష్కరణలపై చర్చించారు.

సంబంధిత పోస్ట్