మంచిర్యాల జిల్లా కేంద్రంలో బుధవారం మాలల మహా పాదయాత్ర వాల్ పోస్టర్లను జాతీయ మాల మహానాడు జిల్లా అధ్యక్షులు గజ్జల్లి లక్ష్మణ్ విడుదల చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఎస్సీ వర్గీకరణపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుకు వ్యతిరేకంగా జాతీయ మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షులు పిల్లి సుధాకర్ మాలల మహా పాదయాత్ర చేపట్టినట్లు తెలిపారు. జిల్లాలో జరగబోయే మాలల మహా పాదయాత్రను విజయవంతం చేయాలని ఆయన కోరారు.