కేంద్ర ప్రభుత్వ కార్మిక, రైతాంగ, వ్యతిరేక విధానాలను నిరసిస్తూ ఈ నెల 26న అన్ని జిల్లా కేంద్రాల్లో నిరసన కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు ఐఎఫ్టీయూ జాతీయ ప్రధాన కార్యదర్శి టి. శ్రీనివాస్ తెలిపారు. శుక్రవారం జరిగిన రాష్ట్ర కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడుతూ పదేళ్ళ పాలనలో బీజేపీ రైతాంగ, కార్మిక, వ్యతిరేక విధానాలు అమలు చేస్తోందని ఆరోపించారు. నిరసన కార్యక్రమాలలో కార్మిక వర్గం పాల్గొనాలని ఆయన కోరారు.