మంచిర్యాల: ఫీజు రీయింబర్స్‌మెంట్‌, స్కాలర్ షిప్ విడుదల చేయాలని నిరసన

51చూసినవారు
పెండింగ్ లో ఉన్న ఫీజు రీయింబర్స్‌మెంట్‌, స్కాలర్ షిప్ విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ గురువారం ప్రైవేట్ డిగ్రీ కళాశాలల యాజమాన్య సంఘం ఆధ్వర్యంలో మంచిర్యాల జిల్లా కేంద్రంలో నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా స్థానిక ఐబీ చౌరస్తాలో అంబేద్కర్ విగ్రహానికి వినతిపత్రం సమర్పించారు. అనంతరం సంఘం నాయకులు మాట్లాడుతూ ప్రభుత్వం వెంటనే స్పందించి పెండింగ్ బకాయిలు విడుదల చేయాలని డిమాండ్ చేశారు.